ఎల్బీనగర్లో స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం | fire accident in scrap shop in lb nagar in hyderabad | Sakshi
Sakshi News home page

ఎల్బీనగర్లో స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం

Oct 12 2016 7:12 AM | Updated on Sep 15 2018 8:11 PM

ఎల్బీనగర్లోని బైరామాల్ గూడాలో బుధవారం తెల్లవారుజామున ప్లాస్టిక్ స్క్రాప్ షాపులో మంటలు చెలరేగాయి.

హైదరాబాద్ : ఎల్బీనగర్లోని బైరామాల్ గూడాలో బుధవారం తెల్లవారుజామున ప్లాస్టిక్ స్క్రాప్ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement