కారులో మంటలు : లక్షా 40 వేల నగదు దగ్ధం | fire accident in car at vizianagaram one lakh forty thousand fired | Sakshi
Sakshi News home page

కారులో మంటలు : లక్షా 40 వేల నగదు దగ్ధం

Aug 27 2016 10:58 PM | Updated on Sep 5 2018 9:47 PM

కారులో మంటలు : లక్షా 40 వేల నగదు దగ్ధం - Sakshi

కారులో మంటలు : లక్షా 40 వేల నగదు దగ్ధం

విజయనగరం జిల్లాలో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది.

గజపతినగరం : విజయనగరం జిల్లాలో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. విజయనగరం నుంచి ఒడిశాకు వెళ్తున్న అల్టో కారులో శనివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది.

గజపతినగరం మండలం మారుపల్లి గ్రామం సమీపానికి చేరుకోగానే కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమవ్వడంతో పాటు కారులో ఉన్న లక్షా 40 వేల నగదు కాలి బూడిదైంది. మంటలను గమనించిన డ్రైవర్తో పాటు కారులో ఉన్న ప్రయాణికులు వెంటనే బయటకు దిగడంతో వారికి పెనుప్రమాదం తప్పింది. వాహనంలో గ్యాస్ లీక్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన.. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. బాధితులు ఒడిశా రాష్ట్రం సునాబిద జిల్లా నాల్కో కంపెనీకి చెందినవారిగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement