అమ్మకు చుక్కెదురు | Everything resolution | Sakshi
Sakshi News home page

అమ్మకు చుక్కెదురు

Mar 15 2014 12:36 AM | Updated on Aug 14 2018 4:32 PM

అమ్మకు చుక్కెదురు - Sakshi

అమ్మకు చుక్కెదురు

ఎన్నికల కమిషన్ వద్ద అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చుక్కెదురైంది.

 ఎన్నికల కమిషన్ వద్ద అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చుక్కెదురైంది. చెన్నైలో కొత్తగా ప్రవేశపెట్టిన మినీ బస్సులపై ముద్రించిన రెండాకుల చిహ్నాన్ని తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిం ది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే శుక్రవారం మద్రాసు హైకోర్టులో   పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే ప్రతి పథకంపైనా అమ్మ ఫొటో లేదా అన్నాడీఎంకే గుర్తులు ఉండేలా జాగ్రత్త లు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో అమ్మ క్యాం టీన్లు, అమ్మ మార్కెట్లు, అమ్మ వాటర్ ఇలా అనేక పథకాలు అమలులో ఉన్నాయి. ఎన్నికల వేళ ఈ పథకాలపై ముద్రించిన జయలలిత ఫొటోలను తొలగించడమో లేక కప్పి ఉంచడమో చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మినీ బస్సులపై ముద్రించిన రెండాకుల చిహ్నాన్ని పోలిన నాలుగు ఆకుల బొమ్మ లు అలాగే ఉన్నాయి. దీనిపై డీఎంకే కోశాధికారి స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రా సు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వివాదాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లా రు. ఈ క్రమంలో సీఎం ఫొటోలు తొలగించాలని, అమ్మ అనే పదం ఉండవచ్చని, అన్నా సమాధి వద్ద రెండాకుల చిహ్నాన్ని కొనసాగవచ్చని, మినీ బస్సులపై ఉన్న రెండాకుల చిహ్నా న్ని తొలగించాలంటూ సీఈసీ సూచించింది. సీఈసీ జారీ చేసిన ఆదేశాలను ప్రవీణ్‌కుమార్ శుక్రవారం ప్రకటించారు. సీఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే మద్రాసు హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.

పార్టీ తరపున సీనియర్ న్యాయవాది రాజేం ద్రన్ ాదనను వినిపిస్తూ మినీ బస్సులపై ఉన్నది పర్యావరణ పరిరక్షణ గుర్తేగానీ అన్నాడీఎంకే చిహ్నం కాదని పేర్కొన్నారు. సీఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించేలా ఆదేశాలు జారీ చేయూలని కోరారు. ఈ పిటిషన్ విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement