మందుబాబులకు చెంపదెబ్బ | Dhansikaa shows her martial arts skills on attackers | Sakshi
Sakshi News home page

మందుబాబులకు చెంపదెబ్బ

Dec 17 2014 2:44 AM | Updated on Apr 3 2019 9:05 PM

మందుబాబులకు చెంపదెబ్బ - Sakshi

మందుబాబులకు చెంపదెబ్బ

నటి ధన్సిక మార్షల్ ఆర్ట్స్‌తో తన తడాఖా చూపించింది. ఆత్మరక్షణకు ఆ విద్య ఎలా ఉపయోగపడుతుందో నిరూపించి

నటి ధన్సిక మార్షల్ ఆర్ట్స్‌తో తన తడాఖా చూపించింది. ఆత్మరక్షణకు ఆ విద్య ఎలా ఉపయోగపడుతుందో నిరూపించి ఆడది అబల కాదు సబల అని వాస్తవంగా చాటింది. వివరాల్లో కెళితే...పేరాణై్మ చిత్రంతో నటన తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఈ అమ్మడు పరదేశి తదితర చిత్రాలతో చక్కని ప్రతిభను ప్రదర్శించి పేరు తెచ్చుకుంది. స్వతహాగా ధన్సిక మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది. తాజాగా ఈమె నటిస్తున్న కాత్తాడి చిత్రం షూటింగ్ కేరళ రాష్ట్రంలోని వాగమన్ అనే ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆ చిత్ర పాట చిత్రీకరణలో పాల్గొనడానికి ధన్సిక, తన మేనేజర్‌తో కలసి వెళ్లారు. ఆ ప్రాంతానికి పలువురు వీక్షకులు వచ్చారు.
 
 వారిలో ఒక గ్రూప్ క్యారవాన్ వ్యాన్‌లో వున్న ధన్సికను చూసి ఆమెతో ఫొటోలు దిగడానికి ప్రయత్నించారు. అయితే వారు మద్యం తాగి వుండటం గ్రహించిన మేనేజర్ వారిని నివారించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ గుంపులో ఒక వ్యక్తి మేనేజర్ మెడపై కొట్టడంతో ఆయన కింద పడిపోయారు. ఇదంతా క్యారవాన్ వ్యాన్‌లో నుంచి చూస్తున్న ధన్సిక వెంటనే కిందికి దిగి తను ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌కు పని చెప్పింది. ఆమెపై దురుసుగా ప్రవర్తించిన వారి చెంపలు చెళ్లుమనిపించింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు కల్యాణ్ తెలుపుతూ షూటింగ్ చూడటానికివచ్చిన వారిలో కొందరు అసభ్యంగా ప్రవర్తించగా, ధన్సిక బుద్ధి చెప్పినట్లు తెలిపారు. దీంతో చిత్ర యూనిట్ పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆ అల్లరి మూకను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి హెచ్చరించి వదలి పెట్టారని కల్యాణ్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement