సీపీఐ అభ్యర్థికి ఎంటీ జాక్ మద్దతు | CPI to support Manpreet in Bathinda - The Tribune | Sakshi
Sakshi News home page

సీపీఐ అభ్యర్థికి ఎంటీ జాక్ మద్దతు

Apr 19 2014 11:28 PM | Updated on Aug 13 2018 6:24 PM

మద్దతుగా నినదిస్తున్న ఎంటీ జాక్ సభ్యులు - Sakshi

మద్దతుగా నినదిస్తున్న ఎంటీ జాక్ సభ్యులు

దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సీపీఐ అభ్యర్థి ప్రకాశ్‌రెడ్డికి ఎంటీజేఏసీ మద్దతు ప్రకటించింది.

సాక్షి, ముంబై: దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సీపీఐ అభ్యర్థి ప్రకాశ్‌రెడ్డికి ఎంటీజేఏసీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భం గా ఆయనకు మద్దతుగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్లీలో బీడీడీ చాల్స్ నుంచి వర్లీ నాకావరకు  ప్రచార ర్యాలీ నిర్వహిం చారు. ఈ ర్యాలీలో సీపీఐ కార్యకర్తలతోపాటు ఎంటీ  జాక్ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ఈ సందర్బంగా ఎంటీ జాక్ వైస్ చైర్మన్ కె.నర్సింహగౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో సీపీఐ కీలకపాత్ర పోషించిందన్నారు. అదేవిధంగా ఇక్కడ కార్మికుల హక్కుల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతోందన్నారు. అందువల్ల ఈ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

 

వీటితోపాటు ప్రస్తుతం మిల్లు కార్మికులకు గృహాల కోసం నిరంతర పోరాటం జరుపుతున్న సీపీఐ నాయకుడు ప్రకాష్‌రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భం గా ఎంటీ జాక్ పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో ఎంటీ జాక్ నేతకులు శివరాజ్ బొల్లే, మూల్‌నివాసి మాల, భీంరత్న మాల, కె.స్వామిగౌడ్, సీపీఐ నాయకులు బుచ్చిరాజం, గుండ్ల లక్ష్మి, ఎ.సరోజ, సబ్బని విజయలక్ష్మి, రుక్మిణి సురం పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement