'కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు' | Congress Senior Leader V Hanumantha Rao Slams CM KCR | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు'

Aug 25 2016 3:57 PM | Updated on Sep 19 2019 8:28 PM

కాంగ్రెస్ నాయకులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు.

హైదరాబాద్‌: కాంగ్రెస్ నాయకులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేసులు పెట్టి జైల్లో పెడతా, చిప్ప కూడు తినిపిస్తా అని కేసీఆర్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రాణహిత - చేవేళ్ల జాతీయ ప్రాజెక్టు కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. జైలుకు పోవటం కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్తకాదు అన్నారు. మహారాష్ట్రతో జరిగిన ఒప్పందంతో ఆ రాష్ట్రానికి లాభం చేకూర్చి ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఒక్క కేసు పెట్టినా.. అది టీఆర్ఎస్ పతనానికి నాంది అవుతుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement