పశ్చిమగోదావరిజిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో సోలార్ పవర్ ప్లాంట్‌ను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించారు.
పరిశ్రమల ఏర్పాటుకు అటవీ భూములు
Nov 21 2016 2:47 PM | Updated on Sep 4 2017 8:43 PM
ఉంగుటూరు: పశ్చిమగోదావరిజిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో సోలార్ పవర్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అటవీ భూములను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రెండు పంటలు పండుతున్నా పరిశ్రమలు లేక ఆదాయంలో వెనుకబడి ఉందన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు భూముల కొరత సమస్యగా ఉందంటూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి లభిస్తుందని, కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Advertisement
Advertisement