బెజవాడలో డూండీ గణేష్ ఉత్సవాలకు టీడీపీ నేతల అత్యుత్సాహంతో రాజకీయ రంగు పులుముకుంది.
దీంతో తెలుగు తమ్ముళ్లు ప్రచార్భాటానికి తెర లేపారు. కళాశాల ప్రాంగణమంతా సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఫొటోలను ఏర్పాటు చేశారు. దీంతో ఆధ్యాత్మిక కార్యక్రమం కాస్త పచ్చపార్టీ ఉత్సవంగా మారింది. టీడీపీ నేతల తీరుపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.