పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఆదివారం పెద్ద ప్రమాదం తప్పింది.
రామగుండం ఎన్టీపీసీలో తప్పిన ప్రమాదం
Oct 30 2016 9:39 AM | Updated on Sep 4 2017 6:46 PM
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఆదివారం పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్టీపీసీలోని బొగ్గు బంకర్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో నాలుగో యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బంకర్ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బంకర్‌లో నిల్వ ఉన్న 20 వేల టన్నుల బొగ్గు నేల పాలయింది. ఎన్టీపీసీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బంకర్ కూలడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. పునరుద్ధరణ పనులు చేపట్టారు.
Advertisement


