breaking news
bunker collapse
-
Israel-Hezbollah war: బంకర్ బస్టర్ బాంబు వినియోగం
బీరుట్: హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై దాడిలో ‘బంకర్ బస్టర్’ బాంబును వాడినట్లు రక్షణ రంగ నిపుణుడు ఎలిజా మాగి్నయర్ చెప్పారు. అత్యంత ఆధునాతన జీబీయూ–72 రకం బాంబును ఇజ్రాయెల్ వాడింది. దీనిని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘‘2021లో రూపొందించిన ఈ బాంబు బరువు ఏకంగా 2,200 కేజీలు. దాడి చేసిన చోట ఎవ్వరూ ప్రాణాలతో బయటపడకూడదనే గట్టి నిశ్చయంతో ఇజ్రాయెల్ ఈ బాంబు వేసినట్లు స్పష్టమవుతోంది. జార విడిచిన వెంటనే భవనం అండర్‌గ్రౌండ్‌లోకి దూసుకుపోవడం, ఆ మొత్తం భవనం నేలమట్టం కావడం అంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఇక్కడ ఏకకాలంలో ఇలాంటి బాంబుల్ని ఇంకొన్ని జారవిడిచినట్లు ఘటనాస్థలిని చూస్తే తెలుస్తోంది. భారీ భవనాలను క్షణాల్లో శిథిలాల కుప్పగా మార్చే సత్తా వీటి సొంతం’’ అని ఎలిజా వ్యాఖ్యానించారు. శుక్రవారం లెబనాన్‌లో వేర్వేరు చోట్ల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 25 మంది చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా ఈవారంలో మరణాల సంఖ్య 720 దాటింది. -
రామగుండం ఎన్టీపీసీలో తప్పిన ప్రమాదం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఆదివారం పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్టీపీసీలోని బొగ్గు బంకర్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో నాలుగో యూనిట్లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బంకర్ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బంకర్లో నిల్వ ఉన్న 20 వేల టన్నుల బొగ్గు నేల పాలయింది. ఎన్టీపీసీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బంకర్ కూలడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. పునరుద్ధరణ పనులు చేపట్టారు. -
రామగుండం ఎన్టీపీసీలో తప్పిన ప్రమాదం