వధువు తండ్రి, చెల్లికి వైరస్‌.. పెళ్లికి బ్రేక్‌ | Bride Sister And Father Get Coronavirus Positive Break For Wedding Ballari | Sakshi
Sakshi News home page

పెళ్లికి కరోనా బ్రేక్‌

Jun 11 2020 2:11 PM | Updated on Jun 11 2020 2:11 PM

Bride Sister And Father Get Coronavirus Positive Break For Wedding Ballari - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి బళ్లారి: ఆనందంగా గురువారం వివాహం జరగాల్సిన ఓ పెళ్లింట వధువు తండ్రికి, చెల్లికి కరోనా పాజిటివ్‌ రావడంతో మూడుముళ్ల సంబరం వాయిదా పడింది. కర్ణాటకలో యాదగిరి తాలూకా అల్లిపుర తాండాకు చెందిన ఓ యువతికి, కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా నాల్వార తాండాకు చెందిన యువకునితో పెళ్లికి  ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే పెళ్లికూతురు తండ్రికి, చెల్లికి కరోనా పాజిటివ్‌ రావడంతో అంతా తారుమారైంది. పెళ్లిని వాయిదా వేశారు. వధువు, ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతం నెల్లూరులో నివాసం ఉన్నారు. పెళ్లికూతురు కుటుంబం 10 రోజుల క్రితం జిల్లాకు వచ్చింది. అంతర్రాష్ట్ర ప్రయాణం కావడంతో వైద్యసిబ్బంది వారికి కరోనా పరీక్షలు జరిపి ఏడు రోజులు పాటు క్వారంటైన్‌లో ఉంచి ఇంటికి పంపారు. ఇప్పుడు నివేదికలో తండ్రి, చెల్లికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరితో పాటు అల్లీపుర తాండాలో 11 మందికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. (డాక్టర్‌ అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు)

Advertisement
 
Advertisement
Advertisement