టీడీపీలో ఎమ్మెల్యే బొండా కలకలం | bonda umamaheswara rao put up pawan kalyan flex poster | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఎమ్మెల్యే బొండా కలకలం

Sep 2 2016 11:56 AM | Updated on Mar 22 2019 5:33 PM

టీడీపీలో ఎమ్మెల్యే బొండా కలకలం - Sakshi

టీడీపీలో ఎమ్మెల్యే బొండా కలకలం

టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్లెక్సీలతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు.

విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్లెక్సీలతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఆయన పెట్టించిన ప్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ గుర్తు, సీఎం చంద్రబాబు నాయుడు ఫొటోలు లేకుండా ప్లెక్సీలు తయారు చేయించారు. పవన్ కళ్యాణ్, తన ఫొటోలు మాత్రమే ప్లెక్సీల్లో ఉండడంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు.

అధినేత, పార్టీ గుర్తు లేకుండా పవన్ తో తననొక్కడి ఫొటోలు మాత్రమే వేయించుకోవడంతో ఎమ్మెల్యే బొండా వ్యవహారంపై టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీ ఎంపీలు ఏమాత్రం చిత్తశుధ్ధి ప్రదర్శించడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించిన నేపథ్యంలో ఎమ్మెల్యే బొండా ప్లెక్సీలు పెట్టించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement