గౌహతిలో జంట పేలుళ్లు, నలుగురికి గాయాలు | Bomb blast injures four in Guwahati: Police | Sakshi
Sakshi News home page

గౌహతిలో జంట పేలుళ్లు, నలుగురికి గాయాలు

Dec 5 2015 4:24 PM | Updated on Sep 3 2017 1:33 PM

గౌహతిలో జంట పేలుళ్లు, నలుగురికి గాయాలు

గౌహతిలో జంట పేలుళ్లు, నలుగురికి గాయాలు

అసోంలోని గౌహతిలో శనివారం జంట బాంబు పేలుళ్లు సంభవించాయి.

అసోం: అసోంలోని గౌహతిలో శనివారం జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. నిత్యం రద్దీగా ఉండే ఫ్యాన్సీ బజార్ ప్రాంతంలో ఓ దేవాలయానికి సమీపంలోని చెత్త డంప్లో ఒక్కసారిగా నాటు బాంబులు పేలడంతో నలుగు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 

గౌహతి పోలీస్ కమిషనర్ ముఖేష్ అగర్వాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉల్ఫా తీవ్రవాదులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. పేలుడు పదార్థాలను దేవాలయానికి దగ్గరలో చెత్తకుండి డంప్ కింద అగంతకులు పెట్టినట్టుగా  అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement