అనంతపురం పట్టణంలోని తపోవనంలో రోడ్డుపక్కన ఉన్న ఒక చెత్తకుండీలో శనివారం ఉదయం పెద్ద పేలుడు సంభవించింది.
చెత్త కుండీలో పేలుడు
Aug 27 2016 11:23 AM | Updated on Apr 3 2019 3:52 PM
-మహిళకు తీవ్ర గాయాలు
అనంతపురం: అనంతపురం పట్టణంలోని తపోవనంలో రోడ్డుపక్కన ఉన్న ఒక చెత్తకుండీలో శనివారం ఉదయం పెద్ద పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటున్న మహిళ తీవ్రంగా గాయపడింది. మహిళ చెత్త కుండీలో ప్లాస్టిక్ కవర్లకోసం వెతుకుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. అయితే పేలింది నాటు బాంబా లేక పటాసులా అనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు అవడంతో పాదచారులు ఉలిక్కపడి పరుగులు తీశారు. పోలీసులు గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొససాగుతోంది.
Advertisement
Advertisement