ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని పరిశీలించిన బిడ్డర్లు | bidders visits at bhogapuram airport surrounding villages | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని పరిశీలించిన బిడ్డర్లు

Nov 14 2016 6:21 PM | Updated on Sep 4 2017 8:05 PM

భోగాపురంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని బిడ్డర్లు పరిశీలించారు.

భోగాపురం : విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని సోమవారం బిడ్డర్లు పరిశీలించారు. పోర్టు నిర్మాణానికి పోటీలో ఉన్న జీఎంఆర్, జీవీకే, టాటా, అదానీ తదితర 8 సంస్థల ప్రతినిధులు కంచేరు, గూడెపు వలస, కవులవాడ రెవెన్యూ గ్రామాల పరిధిలోని ప్రాంతాన్ని, అప్రోచ్ రోడ్లను పరిశీలించారు. అనంతరం ఈ సంస్థల ప్రతినిధులు స్థానిక సన్‌రే రిసార్ట్సులో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు అథారిటీ, సర్వే సంస్థల అధికారులు బిడ్డర్లకు అవసరమైన సమాచారం అందించటంతో పాటు సందేహాలను నివృత్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement