ఆ చిత్రంలో అతిథి నేనే | Bhavana Guest role in Kollywood movie | Sakshi
Sakshi News home page

ఆ చిత్రంలో అతిథి నేనే

Apr 15 2015 4:18 AM | Updated on Sep 3 2017 12:18 AM

ఆ చిత్రంలో అతిథి నేనే

ఆ చిత్రంలో అతిథి నేనే

చిత్ర పరిశ్రమలో అంతు పట్టని ఒక పెద్ద ప్రశ్నార్థకం... ఇక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ..?

చిత్ర పరిశ్రమలో అంతు పట్టని ఒక పెద్ద ప్రశ్నార్థకం... ఇక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ..? ఎలా స్పందిస్తారో..? తెలియదు.  కానీ, తనకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టిన నటి పాత్రల్లో నటించడానికి సంకోచిస్తారు. ఇంకా చెప్పాలంటే భయపడతారు కూడా. అలాగని అందర్నీ ఒకేలా జమకట్టలేం. నటి మల్లిక తమళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో నటించి మంచి గుర్తిం పు పొందారు. అలాంటి ఆమె నటిగా రాణించాలంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనాలో అనే విషయాన్ని బహిరంగంగా వెల్లడించి పరిశ్రమలో కలకలం రేపారు.
 
  ఆమె ఇప్పుడు తెర వెనుక వెళ్లి సినిమాకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నారు. తన అనుభవాలు ఏమోగానీ, సినిమా పరిశ్రమలో సహాయ నటీమణులు ఎదుర్కొనే సమస్యలను యథార్థంగా తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో హీరోయిన్‌గా భావన నటిస్తున్నట్టు వెల్లడించారు. ఈ వార్త చెవిన పడగానే, అయ్యయ్యో అంటూ భావన విస్మయంలో పడ్డారు. అయ్యయో...స్నేహం కోసం నటి మల్లిక కోరగా ఆమె దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించానని భావన పేర్కొన్నారు.
 
 అయితే, ఆ చిత్రంలో తాను హీరోయిన్ మాత్రం కాదు అని ఓ చిన్న అతిథి పాత్రను పోషించనున్నట్టు స్పష్టం చేశారు. తనను హీరోయిన్  పాత్రగా చిత్రీకరించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం తాను మలయాళంలో బిజీగా ఉన్నట్టు తెలిపారు. కాగా, పులి చిత్రంలో నటించమని చిత్ర యూనిట్ తనను అడిగారని, అయితే, తాను వారికి ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదని భావన పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement