దళారుల దోపిడీని అడ్డుకోవాలి: భట్టి | bhatti vikramarka visits khammam agriculture market | Sakshi
Sakshi News home page

దళారుల దోపిడీని అడ్డుకోవాలి: భట్టి

Oct 28 2016 11:18 AM | Updated on Aug 17 2018 5:24 PM

దళారుల దోపిడీని అడ్డుకోవాలి: భట్టి - Sakshi

దళారుల దోపిడీని అడ్డుకోవాలి: భట్టి

వ్యవసాయ మార్కెట్‌లో దళారుల దోపిడీని అరికట్టాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

ఖమ్మం అగ్రికల్చర్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో దళారుల దోపిడీని అరికట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం అఖిలపక్షాల నాయకులతో కలిసి మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పత్తి రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. పత్తికి డిమాండ్ తగ్గిందంటూ దళారులు, వ్యాపారులు కలిసి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. పత్తి క్వింటాలుకు రూ.7,500 చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement