శవాన్ని వదిలి పరుగులు తీసిన జనం | bees attack in Cemetery | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడి

Feb 13 2018 7:19 AM | Updated on Feb 13 2018 7:19 AM

bees attack in Cemetery - Sakshi

తేనెటీగల దాడితో పరుగులుతీసి వచ్చిన మృతుడి బంధువులు

దేవనహళ్లి (దొడ్డబళ్లాపురం): శవ సంస్కారం చేయడానికి శ్మశానానికి వచ్చిన వారిపై తేనెటీగలు దాడిచేయడంతో జనం శవాన్ని వదిలి పరుగులు తీశారు. ఈ సంఘటనలో 15 మంది గాయపడ్డారు. దేవనహళ్లి తాలూకా విజయపురం పట్టణంలో ఈ సంఘటన సోమవారం   చోటుచేసుకుంది. విజయపుర పట్టణంలో నరసింహ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శవాన్ని తీసుకుని పట్టణంలోని శ్మశానానికి వచ్చారు. అందరూ శవసంస్కారానికి ఏర్పాట్లు చేస్తుండగా శ్మశానంలో ఉన్న చెట్టుకి కట్టిన తేనెపట్టు నుంచి హఠాత్తుగా ఎగిరి వచ్చిన తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో జనం శవాన్ని వదిలి పరుగులు తీశారు. అయినా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement