మహిళలకు ఉచిత బ్యాటరీ స్కూటర్లు | BBMP Budget Hilights Karnataka | Sakshi
Sakshi News home page

వనితలకు ఉచిత బ్యాటరీ స్కూటర్లు

Feb 19 2019 12:42 PM | Updated on Feb 19 2019 12:42 PM

BBMP Budget Hilights Karnataka - Sakshi

వార్డుకు 20 మందికే బీబీఎంపీ బడ్జెట్‌ హైలైట్స్‌  

కర్ణాటక, బనశంకరి: ప్రతివార్డులో 20 మంది మహిళలకు మోపెడ్‌  (ఎలక్ట్రిక్‌     స్కూటీలు) అందిస్తారు.  
♦ మహిళల ఆర్దికస్వావలంబనకోసం రుణాల సౌలభ్యం
♦ ఉత్తమ పాలన వ్యవçస్థ కోసం ఒకే ఫైల్‌ నిర్వహణ         పద్దతి అమలు
♦ 400 ప్రాంతాల్లో ఉచిత వైఫై వ్యవస్థ  
♦ పాలికె ఆదాయం పెంచడానికి జాగృతదళం స్థాపన
♦ ప్రతివార్డులో ఎస్సీఎస్టీ స్లంబోర్డు అభివృద్ధికి రూ.30 కోట్లు  
♦ పౌర కార్మికుల మధ్యాహ్న భోజనానికి రూ.12 కోట్లు
♦ ప్రతివార్డులో ఎస్సీ, ఎస్టీలకు పది ఇళ్ల నిర్మాణం
♦ మహిళలకోసం ఆరోగ్య కవచ పథకం 

క్యాన్సర్‌ పరీక్షలకు వాహనం  
♦ క్యాన్సర్‌ జబ్బు నిర్ధారణ పరీక్షలు చేసే బస్‌ కొనుగోలుకు     రూ. 3 కోట్లు
♦ మహిళా పాలికె కార్పోరేటర్లు వార్డులకు  తలా రూ.10 లక్షల నిధులు
♦ నిరాశ్రయుల నిలయానికి రూ. కోటి నిధులు
♦ విభిన్నప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.75 కోట్లు
♦ బాబు జగ్జీవన్‌రాం ప్రజా ఆసుపత్రిలో క్యాన్సర్‌ చికిత్సా కేంద్రం తెరవడానికి రూ.50 లక్షలు  
♦ బీబీఎంపీ ఆస్తులు, భూములు నిర్వహణ కు రూ.55 కోట్లు  
♦ నిరుపేద గుండెజబ్బు రోగులకు ఉచితంగా స్టెంట్లు     అమర్చడానికి రూ.4 కోట్లు
♦ కొత్తగా డయాలసిస్‌ కేంద్రాల స్థాపనకు రూ.25 కోట్లు
♦ కిద్వాయ్‌ ఆసుపత్రి ధర్మశాల ఆధునీకరణకు రూ.5 కోట్లు  
♦ నగరంలో కాలుష్యం అధికంగా ఉన్నచోట్ల వాయు శుద్ధీకరణ యంత్రాలను అమర్చడానికి రూ.5 కోట్లు  
♦ తాయి మడిలు పథకానికి రూ.1.50 కోటి
♦ ప్రాణుల చికిత్సా కేంద్రానికి రూ.5 కోట్లు
♦ నిరుపేద క్రీడాకారులకు సాయానికి రూ. కోటి కేటాయింపు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement