చిల్లర దాడి | Attack On Conductor For Money Change In Karnataka | Sakshi
Sakshi News home page

కండక్టర్‌పై దాడి

Aug 11 2018 11:30 AM | Updated on Aug 11 2018 11:30 AM

Attack On Conductor For Money Change In Karnataka - Sakshi

గాయపడిన కండక్టర్‌

దొడ్డబళ్లాపురం: కేవలం ఆరు రూపాయల చిల్లర కోసం ఒక ప్రయాణికుడు కండక్టర్‌పై దాడికి పాల్పడిన ఘటన విజయపుర జిల్లా ఇండి తాలూకాలో చోటుచేసుకుంది. సులేమాన్‌ అనే ప్రయాణికుడు గురువారం తాంబా గ్రామంలో కేఎస్‌ ఆర్టీసీ బస్సు ఎక్కాడు.   చిల్లరలేకపోవడంతో  కండక్టర్‌ ఇన్నూసాబ్‌ ఉస్మాన్‌సాబ్‌ టిక్కెట్‌ వెనుక రూ.6 చిల్లర రాసి ఇచ్చాడు. బస్సు గమ్యస్థలానికి వచ్చినా కండక్టర్‌ చిల్లర ఇవ్వలేదన్న కోపంతో సులేమాన్‌  గొడవపడ్డాడు. చివరకు డిపోకు వెళ్లి చిల్లర డబ్బు తీసుకున్నాడు.   శుక్రవారం బస్సు తాంబా గ్రామానికి రాగా సులేమాన్‌ సదరు కండక్టర్‌పై ఇనుపరాడ్‌తో తలపై బాదాడు. దీంతో కండక్టర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు  స్పందించి బాధితుడిని  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement