ఢిల్లీలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!
నిత్య సమస్యగా మారిన ట్రాఫిక్ జామ్‌ల నుంచి ఢిల్లీ నగరానికి విముక్తి కలిగించేందుకు కేజ్రీవాల్ సర్కారు నడుం బిగించింది.
సాక్షి, న్యూఢిల్లీ : నిత్య సమస్యగా మారిన ట్రాఫిక్ జామ్‌ల నుంచి ఢిల్లీ నగరానికి విముక్తి కలిగించేందుకు కేజ్రీవాల్ సర్కారు నడుం బిగించింది. నగరంలో ట్రాఫిక్ జామ్‌ల సమస్యను శాస్త్రీయంగా, ప్రణాళికాబద్దంగా తొలగించడం కోసం ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువగా ఏర్పడే రోడ్ల జాబితాను రూపొందించవలసిందిగా రవాణా కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె.ఎం కుట్టికి లేఖ రాశారు.
ట్రాఫిక్ జామ్‌లకు కారణాలతో పాటు ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే ప్రాంతా లపై వారం రోజు ల్లో నివేదిక సమర్పించాలని ఆయన సీఎస్‌ను ఆదేశించారు. సంవత్సరం పొడవునా ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ జామ్‌ల సమస్య ఉంటోం దని, ఆఫీసుకు, కాలేజీకి లేదా ఇంటికి సకాలంలో చేరుకోవడమన్నది నిత్య సమస్యగా మారిందని సీఎస్‌కు రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఈ సమస్యను శాస్త్రీయంగా, ప్రణాళికాబద్దంగా పరిష్కరించవలసిన అవసరం ఉందని, సెప్టెంబర్ 25లోగా నిర్మాణాత్మక డిజైన్ సమస్యలు, ఆక్రమణలు ఉన్న రోడ్లు, ఇరుకు రోడ్లపై నివేదిక అందించాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులతో కూడా మాట్లాడి ట్రాఫిక్ జామ్‌లకు ప్రధాన కారణాలు, ఈ సమస్య పరిష్కారాలను నివేదికలో చేర్చాలని చెప్పారు. సమస్యాత్మక రోడ్ల జాబితాను తయారు చేసేటప్పుడు ప్రజల సలహాలను కూడా తీసుకోవాలని సూచించారు. 2016లో అప్పట్లో రవాణా మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ నగరంలో రోడ్ల డిజైన్‌లో సమస్యలు ఉన్నాయని, వాటిని రీడిజైన్ చేయవలసిన అవసరం ఉందని ప్రతిపాదించారు.
రీ డిజైన్ కోసం పైలట్ ప్రాజెక్టు కింద 10 రోడ్లను కూడా ఎంపిక చేశారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి నివేదిక తరువాత ప్రభుత్వం అన్ని విభాగాలతో చర్చించి నగర రోడ్ల రీ డిజైన్ ప్రాజెక్టును పెద్ద ఎత్తున చేపడుతందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉత్తర ఢిల్లీని, దక్షిణఢిల్లీతో జోగిచే నార్త్ సౌత్ కారిడార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ కారిడార్ నిర్మాణం మూడున్నర సంవత్సరాలలో పూర్తవుతుందని ప్రభుత్వం ఆంటోంది. ఆరు లేన్ల ఈ కారిడార్ నిర్మాణం పూర్తైన తరువాత వజీరాబాద్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాల్లో చేరుకోవచ్చని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.


