breaking news
Delhi traffic
-
ఢిల్లీ ట్రాఫిక్ చలాన్.. ఈ కొత్త రూల్‌తో వాహనదారులకు షాక్!
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ట్రాఫిక్ చలాన్ నిబంధనలపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చలాన్‌పై అభ్యంతరం ఉంటే.. ముందుగా అధికారులకే ఫిర్యాదు చేయాలి.. ఒకవేళ అక్కడ కూడా తిరస్కరణకు గురైతే కోర్టును ఆశ్రయించాలి. అలా చేసేముందు చలాన్ మొత్తంలో 50 శాతం చెల్లించాలన్న నిబంధనపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ సోమవారం ఢిల్లీ జిల్లా కోర్టుల న్యాయవాదులు విధులకు దూరంగా ఉండి నిరసన తెలిపారు.ట్రాఫిక్ చలాన్ విషయంలో ఈ నిబంధన వాహనదారులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉందన్న చర్చ మొదలైంది. దాంతో తప్పుగా చలాన్ వేశారని భావించే వ్యక్తి ముందుగా నిర్ణీత అధికారికి అభ్యంతరం చెప్పాలి. అక్కడ కూడా తన వాదనకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే కోర్టుకు వెళ్లే ముందు చలాన్ మొత్తంలో సగం చెల్లించాల్సి ఉంటుంది. ఈ 50 శాతం నిబంధనే ఇప్పుడు ప్రధాన వివాదంగా మారింది.ఈ మార్పులు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (CMVR), 1989లోని రూల్ 167కు చేసిన సవరణలతో వచ్చాయి. దీంతో కొత్త రూల్ 167(5) ప్రకారం.. చలాన్ జారీ అయిన తర్వాత వాహనదారుడికి రెండు అవకాశాలు ఉంటాయి. చలాన్లో పేర్కొన్న జరిమానాను చెల్లించడం లేదా నిర్ణీత పోర్టల్‌తో దానిని సవాలు చేయడం. ఇలా అభ్యంతరం తెలిపేటప్పుడు అందుకు సంబంధించిన పత్రాలు, ఆధారాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.అయితే, చలాన్‌ను సవాలు చేసేందుకు 45 రోజుల గడువు ఉంటుంది. ఈ సమయంలోనే అధికారిని ఆశ్రయించకపోతే చలాన్‌ను అంగీకరించినట్టుగా పరిగణిస్తారు. అయినప్పటికీ ఒకవేళ వాహనదారుడి అభ్యంతరాన్ని అధికారి తిరస్కరిస్తే.. ఆ తర్వాత సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే దీనికన్నా ముందే చలాన్ మొత్తంలో 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది.ఈ నిబంధనపైనే న్యాయవాదులు ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చలాన్ సరైనదా? కాదా? అనే విషయాన్ని తుది నిర్ణయంగా తేల్చాల్సింది న్యాయస్థానమేనని వారు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారి ముందుగా అభ్యంతరాన్ని తిరస్కరించిన తర్వాతే కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడం వల్ల న్యాయపరమైన హక్కులకు ఇబ్బంది కలగొచ్చని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ముందుగానే 50 శాతం జరిమానా చెల్లించాల్సిన నిబంధన సామాన్యులకు భారంగా మారుతుందని అంటున్నారు.మరోవైపు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు ప్రత్యేక పరిస్థితులు కూడా కారణం కావచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. అత్యవసర వైద్య పరిస్థితి, తీవ్రమైన ట్రాఫిక్ జామ్ వంటి సందర్భాల్లో అనుకోకుండా నిబంధన ఉల్లంఘించే పరిస్థితి రావచ్చని పేర్కొంటున్నారు. అలాంటి సందర్భాల్లో తమ వాదనను కోర్టు ముందు వివరించే అవకాశం ఉండాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చలాన్ విధానంపై ఢిల్లీలోని జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్లు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేయగా.. సెప్టెంబర్ 20న సర్క్యులర్ జారీ చేశాయి. దీంతో తాజాగా న్యాయవాదులు విధులకు దూరంగా ఉండటంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ, జెమినీలను వణికిస్తున్న ‘జేవ్ ఏఐ’! -
ఢిల్లీలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!
సాక్షి, న్యూఢిల్లీ : నిత్య సమస్యగా మారిన ట్రాఫిక్ జామ్‌ల నుంచి ఢిల్లీ నగరానికి విముక్తి కలిగించేందుకు కేజ్రీవాల్ సర్కారు నడుం బిగించింది. నగరంలో ట్రాఫిక్ జామ్‌ల సమస్యను శాస్త్రీయంగా, ప్రణాళికాబద్దంగా తొలగించడం కోసం ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువగా ఏర్పడే రోడ్ల జాబితాను రూపొందించవలసిందిగా రవాణా కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె.ఎం కుట్టికి లేఖ రాశారు. ట్రాఫిక్ జామ్‌లకు కారణాలతో పాటు ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే ప్రాంతా లపై వారం రోజు ల్లో నివేదిక సమర్పించాలని ఆయన సీఎస్‌ను ఆదేశించారు. సంవత్సరం పొడవునా ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ జామ్‌ల సమస్య ఉంటోం దని, ఆఫీసుకు, కాలేజీకి లేదా ఇంటికి సకాలంలో చేరుకోవడమన్నది నిత్య సమస్యగా మారిందని సీఎస్‌కు రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సమస్యను శాస్త్రీయంగా, ప్రణాళికాబద్దంగా పరిష్కరించవలసిన అవసరం ఉందని, సెప్టెంబర్ 25లోగా నిర్మాణాత్మక డిజైన్ సమస్యలు, ఆక్రమణలు ఉన్న రోడ్లు, ఇరుకు రోడ్లపై నివేదిక అందించాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులతో కూడా మాట్లాడి ట్రాఫిక్ జామ్‌లకు ప్రధాన కారణాలు, ఈ సమస్య పరిష్కారాలను నివేదికలో చేర్చాలని చెప్పారు. సమస్యాత్మక రోడ్ల జాబితాను తయారు చేసేటప్పుడు ప్రజల సలహాలను కూడా తీసుకోవాలని సూచించారు. 2016లో అప్పట్లో రవాణా మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ నగరంలో రోడ్ల డిజైన్‌లో సమస్యలు ఉన్నాయని, వాటిని రీడిజైన్ చేయవలసిన అవసరం ఉందని ప్రతిపాదించారు. రీ డిజైన్ కోసం పైలట్ ప్రాజెక్టు కింద 10 రోడ్లను కూడా ఎంపిక చేశారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి నివేదిక తరువాత ప్రభుత్వం అన్ని విభాగాలతో చర్చించి నగర రోడ్ల రీ డిజైన్ ప్రాజెక్టును పెద్ద ఎత్తున చేపడుతందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉత్తర ఢిల్లీని, దక్షిణఢిల్లీతో జోగిచే నార్త్ సౌత్ కారిడార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ కారిడార్ నిర్మాణం మూడున్నర సంవత్సరాలలో పూర్తవుతుందని ప్రభుత్వం ఆంటోంది. ఆరు లేన్ల ఈ కారిడార్ నిర్మాణం పూర్తైన తరువాత వజీరాబాద్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాల్లో చేరుకోవచ్చని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.


