కల నెరవేరింది | AR Murugadoss's 'Akira' Has Lakshmi Rai In Guest Role! | Sakshi
Sakshi News home page

కల నెరవేరింది

Apr 3 2015 1:58 AM | Updated on Sep 2 2017 11:45 PM

కల నెరవేరింది

కల నెరవేరింది

ప్రతి ఒక్కరూ కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయాలి ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం పలికిన హితవు.

 ప్రతి ఒక్కరూ కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయాలి ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం పలికిన హితవు. అచ్చం అలానే నటి రాయ్‌లక్ష్మి చాలా కలలు కన్నారు. వాటిలో కొన్ని బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లోనూ నటించాలని, హిందీ చిత్రంలో నటించనున్నానని, హాలీవుడ్ అవకాశం వచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. హాలీవుడ్‌లోకి ఎప్పుడు ప్రవేశిస్తుందోగాని ఈ భామ బాలీవుడ్ కల నెరవేరబోతోంది. అది చిన్న వేషం అయినా మంచి పాత్ర అని కూడా రాయ్‌లక్ష్మి చెబుతున్నారు. ఇంతకీ ఈ బ్యూటీకి బాలీవుడ్ అవకాశం కల్పించిందెవరో తెలుసా, నటి ఆసిన్‌ను బాలీవుడ్‌కు పంపించిన కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాసనే.
 
 తమిళంలో కత్తి వంటి సంచలన విజయం సాధించిన చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన తాజాగా అకిరి పేరుతో హిందీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది తమిళంలో అనూహ్య విజయాన్ని సాధించిన మౌనగురు చిత్రానికి రీమేక్. ఇందులో సోనాక్షి సిన్హా హీరోయిన్. ఆమె తండ్రి సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాయ్‌లక్ష్మికి నటించే అవకాశం రావడం విశేషం. దీని గురించి రాయ్‌లక్ష్మి చెబుతూ కాస్ట్యూమ్స్ డిజైనర్ ఒకరు తన పేరును దర్శకుడు మురుగదాస్‌కు సూచించడంతో తనకీ అవకాశం వచ్చిందని తెలిపారు. పాత్ర కూడా బాగుండడంతో కాదనకుండా ఒప్పేసుకున్నట్లు చెప్పారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడం సంతోషం అని రాయ్‌లక్ష్మి అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement