మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి ముట్టడి | ANMs stage protest, demand pay hike | Sakshi
Sakshi News home page

మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి ముట్టడి

Aug 29 2016 11:23 AM | Updated on Sep 4 2017 11:26 AM

తమ డిమాండ్లను తీర్చి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఎన్‌ఎంలూ మంత్రి నివాసం ముట్టడికి యత్నించారు.

హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఎన్‌ఎంలూ మంత్రి నివాసం ముట్టడికి యత్నించారు. సోమవారం ఉదయం మణికొండలోని మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి వద్దకు భారి ఎత్తున చేరుకున్న ఏఎన్‌ఎంలు ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సమ్మె విరమించి వస్తే సమస్య సరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement