నటి జయంతికి సీఎం పరామర్శ | Actress Jayanthi Fine:CM Siddaramaiah | Sakshi
Sakshi News home page

నటి జయంతికి సీఎం పరామర్శ

Mar 30 2018 9:28 AM | Updated on Mar 30 2018 9:28 AM

Actress Jayanthi Fine:CM Siddaramaiah - Sakshi

జయంతిని పరామర్శిస్తున్న సీఎం సిద్ధరామయ్య

సాక్షి, బెంగళూరు:కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం సీనియర్‌ నటి జయంతిని పరామర్శించారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతూ కొద్ది రోజుల క్రితం నగరంలోని విక్రమ్‌ ఆస్పత్రిలో చేరిన ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  ఆస్పత్రికి చేరుకుని నటి జయంతిని పరామర్శించారు. ఆమెతో చాలాసేపు ముచ్చటించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెను పరామర్శించిన అనంతరం సీఎం మైసూరు  బయలుదేరారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు, త్వరలో వెంటిలేటర్‌కు తీసివేస్తామని ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ కేఎస్‌ సతీష్‌ మీడియాకు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement