దుబాయ్‌లో భూమిక | Actress Bhumika Settled in Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో భూమిక

Aug 10 2015 2:14 AM | Updated on Sep 3 2017 7:07 AM

దుబాయ్‌లో భూమిక

దుబాయ్‌లో భూమిక

సగటు పౌరుడు సంపాదించుకోవడానికి అమెరికా, సింగపూర్, దుబాయ్ లాంటి అరబ్ దేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొందరు నటీమణులు

సగటు పౌరుడు సంపాదించుకోవడానికి అమెరికా, సింగపూర్, దుబాయ్ లాంటి అరబ్ దేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొందరు నటీమణులు మాత్రం ఇక్కడ బాగా సంపాదించుకుని విదేశాల్లో సెటిలవ్వాలని ఆశిస్తుంటారు. నటి భూమిక ఇందుకు అతీతం కాదు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడం భాషల్లో పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయిన నటి భూమిక. 2000 సంవత్సరంలో ప్రముఖ నటిగా వెలుగొందిన ఈమె తమిళంలో బద్రి, రోజాకూటం, చిల్లున్ను ఒరు కాదల్ తదితర చిత్రాల్లో నటించారు.
 
 అలాగే తెలుగులో మిస్సమ్మ, ఖుషి, సింహాద్రి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. యోగా మాస్టర్ భరత్‌ను పెళ్లి చేసుకుని కొంతకాలం నటనకు దూరంగా ఉన్న భూమిక ఆ తరువాత నటిగానే కాకుండా తన భర్తను నిర్మాతగా చేర్చి రెండు మూడు చిత్రాలు నిర్మించారు. భూమికకు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టిన తరువాత నటనకు దూరంగా ఉన్న భూమిక ఇప్పుడు దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. అక్కడ యోగా సెంటర్‌ను నెలకొల్పి భర్తకు సాయంగా ఉంటున్నారు. అంతేకాదు ఇండియాలోనూ పలు యోగా సెంటర్లను నెలకొల్పుతున్నట్లు భూమిక తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement