నటుడు సంతానంకు ఊరట | Actor Santhanam  gets condition bail  | Sakshi
Sakshi News home page

నటుడు సంతానంకు ఊరట

Oct 13 2017 7:32 PM | Updated on Oct 8 2018 3:56 PM

 Actor Santhanam  gets condition bail  - Sakshi

సాక్షి, చెన్నై:  కోలీవుడ్‌ హస్యనటుడు సంతానంకు చెన్నై హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సంతానంకు, బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌ షణ్ముగసుందరంనకు మధ్య ఆర్ధిక లావాదేవీల సమస్య కారణంగా గత సోమవారం వాగ్వాదం జరిగి అది కొట్టుకునే వరకూ దారి తీసింది. ఆ గొడవల్లో షణ్ముగంతో పాటు, అతని స్నేహితుడు, న్యాయవాది, బీజేపీ నాయకుడు ప్రేమానందన్‌ గాయాలపాలైన సంగతి విదితమే. దీంతో న్యాయవాది ప్రేమానందన్‌ స్థానిక వలసరవాక్కం పోలీస్‌స్టేషన్‌లో సంతానంపై  హత్యా బెదిరింపుల కేసు నమోదు చేయడంతో అతను అజ్ఙాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.

కాగా సంతానం ముందస్తు బెయిల్‌ కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ న్యాయమూర్తి ఆదిత్యన్‌ సమక్షంలో విచారణకు రాగా రెండు రోజులుగా వాయిదా వేస్తూ వచ్చారు. శుక్రవారం మరోసారి విచారణకు రాగా గాయాల పాలైన న్యాయవాది ప్రేమానందన్‌ ప్రభుత్వ ఆస్పత్తిలో చేరారా?లేదా? అన్న వివరాలను విచారించి కోర్టుకు అందించాల్సిందిగా వలసర వాక్కం పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ నటుడు సంతానంకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు. అయితే సంతానం రెండు వారాల పాటు రోజూ వలసరవాక్కం పోలీస్‌స్టేషన్‌లో క్రమం తప్పకుండా సంతకం చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement