
పెరుగుతున్న అబార్షన్ల సంఖ్య
నగరంలో అబార్షన్ చేయించుకుంటున్నవారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ఇందులో మైనర్ల సంఖ్య కూడా పెరగడంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, ముంబై: నగరంలో అబార్షన్ చేయించుకుంటున్నవారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ఇందులో మైనర్ల సంఖ్య కూడా పెరగడంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం... గత సంవత్సరం ముంబై లో 30,000 మందికిపైగా మహిళలు అబార్షన్లు చేయించుకున్నారు. ఇందులో 100 మందికిపైగా 15 సంవత్సరాల లోపు బాలికలే ఉన్నారు. 16 నుంచి 19 సంవత్సరాల లోపు వయసుగలవారు 900 మందికిపైగానే ఉన్నా రు. స్వచ్ఛం ద సంస్థ నిర్వాహకురాలు సంగీతా రేగే సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో పెద్దఎత్తున బాల్యవివాహాలు జరుగుతున్నాయి. 2013లో 18బాల్యవివాహాలు జరిగినట్లు ఆమె తెలిపారు.