మెదక్ జిల్లా పుల్కల్ మండలం పోచారం గ్రామ శివారులో ముగ్గురు వ్యక్తులు మంజీరా నదిలో చిక్కుకున్నారు.
మంజీరా నదిలో చిక్కుకున్న కార్మికులు
Oct 4 2016 4:49 PM | Updated on Oct 16 2018 3:12 PM
	- కాపాడేందుకు అధికారుల యత్నం
					
					
					
					
						
					          			
						
				
	పుల్కల్: మెదక్ జిల్లా పుల్కల్ మండలం పోచారం గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు మంజీరా నదిలో చిక్కుకున్నారు. సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో 6 గేట్లు ఎత్తేసి నీళ్లు వదులుతున్నారు. దాంతో మంజీరా నదిలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. సత్యసాయి వాటర్ సప్లై పథకంలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు నీటిలో చిక్కుకున్నారు. వారికి ఈత రాకపోవడంతో కాపాడమని కేకలు వేయడంతో స్థానికులు గమనించారు. అనంతరం అధికారులకు సమాచారం అందించడంతో పుల్కల్ సబ్‌ఇన్‌స్పెక్టర్, తహశీల్దార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని నీటిలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
