రైళ్లో మద్యం తరలింపు: ముగ్గురు అరెస్ట్‌ | 3 arrested by railway police over liquor supply | Sakshi
Sakshi News home page

రైళ్లో మద్యం తరలింపు: ముగ్గురు అరెస్ట్‌

Mar 31 2017 12:48 PM | Updated on Sep 5 2017 7:35 AM

అనుమతులకు విరుద్ధంగా రైళ్లో మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెల్లంపల్లి: అనుమతులకు విరుద్ధంగా రైళ్లో మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 576 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు వెళ్తున్న రైల్లో తనిఖీలు చేపట్టిన రైల్వే ఎస్సై బన్సిలాల్‌ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement