‘మాలేగావ్’ పేలుడు కేసులో ఏటీఎస్, సీబీఐ, హోం శాఖకు నోటీసులు | 2008 Malegaon blast: Notice to ATS, CBI, Home Ministry | Sakshi
Sakshi News home page

‘మాలేగావ్’ పేలుడు కేసులో ఏటీఎస్, సీబీఐ, హోం శాఖకు నోటీసులు

Oct 20 2013 11:28 PM | Updated on Sep 1 2017 11:49 PM

: మాలేగావ్ బాంబు పేలుడు కేసులో దర్యాప్తుపై ఏటీఎస్, సీబీఐ, రాష్ట్ర హోం శాఖకు ముంబై ప్రత్యేక కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది.

ముంబై : మాలేగావ్ బాంబు పేలుడు కేసులో దర్యాప్తుపై ఏటీఎస్, సీబీఐ, రాష్ట్ర హోం శాఖకు ముంబై ప్రత్యేక కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. నవంబర్ 27లోగా నోటీసులకు జవాబు ఇవ్వాలని కోర్టు అందులో పేర్కొంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జరిపిన దర్యాప్తును సవాలు చేస్తూ ఒక నిందితుడు వేసిన పిల్ శనివారం విచారణకు వచ్చింది. వివరాలిలా.. 2008 సెప్టెంబర్ 8న మాలేగావ్‌లో ఒక ప్రార్థనా స్థలంలో జరిగిన బాంబు పేలుడు జరిగింది అందులో 37 మమంది మృతి చెందగా సుమారు 160 మంది గాయపడిన విష యం తెలిసిందే. ఈ సందర్భంగా ఉగ్రవాద వ్యతి రేక విభాగం (ఏటీఎస్) జరిపిన దర్యాప్తు నేపథ్యం లో తొమ్మిది మంది ముస్లిం యువకులను అనుమానితులుగా అరెస్టు చేశారు. అనంతరం విచారణ జరిపిన  ఎన్‌ఐఏ వారిని నిర్దోషులుగా పేర్కొంది.   తమను ఏటీఎస్, సీబీఐ అక్రమంగా ఈ బాంబు పేలుడు కేసులో ఇరికించాయని వారు కోర్టును ఆశ్రయించారు.
 
  కాగా, ఎన్‌ఐఏ దర్యాప్తును వాస్తవికతను ప్రశ్నిస్తూ మనోహర్‌సింగ్ కోర్టును ఆశ్రయిం చాడు. కాగా, ఈ కేసు విచారణను సాగదీసేందుకు, కోర్టును తప్పుదోవ పట్టించేందుకు మనోహర్‌సింగ్ ఈ పిటిషన్ వేశాడని సదరు ముస్లిం యువకులకు అండగా నిలిచిన జమైత్ ఉలేమా-ఈ-హింద్ ఆరోపించింది. కాగా, 2010లో స్వామి ఆశీమానంద అరెస్టు అనంతరం కేసు మలుపు తిరిగింది. అతడిని  పోలీసులు విచారించినప్పుడు ముస్లింలు ఎక్కువగా ఉండే మాలేగావ్ పట్టణంలో 2008లో జరిగిన బాంబు పేలుడులో హిందూ ఛాందసవాదుల పాత్ర ఉందని తెలిపాడు. 
 
 దాంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగి2006 బాంబు పేలుడుపై తిరిగి దర్యాప్తు జరిపింది. ఈ సందర్భం గా కొత్తగా మనోహర్‌సింగ్, ధన్‌సింగ్, లోకేశ్ శర్మ, రాజేంద్ర చౌదరీలను అరెస్టు చేసింది. గత ఏడాది, ముస్లిం యువకులకు బెయిల్ లభించగా, ఎన్‌ఐఏ దర్యాప్తు ననుసరించి తమకు కేసునుంచి విముక్తి కలిగించాలని వారు కోర్టును ఆశ్రయించారు. కాగా, ఎన్‌ఐఏ విచారణ నిష్పక్షపాతంగా జరగలేదని పేర్కొంటూ నిందితుల్లో ఒకడైన మనోహర్ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement