వేగంగా వెళ్తున్న టాటా ఏస్ వాహనం బోల్తా కొట్టిన ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
టాటాఏస్ బోల్తా: 20 మందికి గాయాలు
Dec 5 2016 1:10 PM | Updated on Jun 1 2018 8:54 PM
ఉరవకొండ: వేగంగా వెళ్తున్న టాటా ఏస్ వాహనం బోల్తా కొట్టిన ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులోని హోతూరు రోడ్డులో సోమవారం ఉదయం జరిగింది. వజ్రకరూర్ మండల నుంచి ఉరవకొండ వెళ్తున్న ప్రయాణికుల ఆటో(టాటాఏస్).. ఉరవకొండ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను గుంతకల్లు ఆస్పత్రికి తరలించగా.. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరగిన సమయంలో ఆటోలో 40 మంది ఉన్నట్లు సమాచారం.
Advertisement
Advertisement