ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు విద్యార్థుల దుర్మరణం | 2 students died in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

Sep 6 2016 10:47 AM | Updated on Aug 30 2018 4:07 PM

వైఎస్సార్ జిల్లా చిన్నమండ్యం శివారులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతి చెందారు.

చిన్నమండ్యం: వైఎస్సార్ జిల్లా చిన్నమండ్యం శివారులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. భానుప్రసాద్, వెంకటేశ్, అశోక్ అనే ముగ్గురు విద్యార్థులు చిన్నమండ్యం నుంచి ద్విచక్రవాహనంలో రాయచోటి వైపు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ సంఘటనలో భానుప్రసాద్, వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరు ముగ్గురు అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నారు. వినాయకచవితి పండుగకు ఇంటికి వచ్చిన  తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భానుప్రసాద్ చిన్నమండెం మండలం పడమటికోన గ్రామానికి చెందినవాడు కాగా వెంకటేశ్ గాలివీడు మండలం గుంటిమడుగు గ్రామానికి చెందినవారు. 

Advertisement
 
Advertisement
Advertisement