10 మంది మావోయిస్టుల లొంగుబాటు | 10 Maoists surrender in Jharkhand | Sakshi
Sakshi News home page

10 మంది మావోయిస్టుల లొంగుబాటు

Apr 26 2017 3:05 PM | Updated on Oct 9 2018 2:53 PM

జార్ఖండ్‌ రాష్ట్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం లోహర్‌దాగా జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టు నేతలు పోలీసులు లొంగిపోయారు.

జార్ఖండ్‌: జార్ఖండ్‌ రాష్ట్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం లోహర్‌దాగా జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టు నేతలు పోలీసులు లొంగిపోయారు. ఒక్కొక్క మావోయిస్టు తలపై రెండు లక్షల రూపాయల చొప్పున రివార్డు కూడా ఉంది. తుపాకులు వీడండి.. వాలీబాల్‌ ఆడండి (బందూక్‌ ఛోడో వాలీబాల్‌ ఖేలో అభియాన్‌) పథకం కింద పోలీసులు మావోయిస్టులను జనజీవన స్పవంతిలోకి తెచ్చేందుకు ప్రవేశపెట్టిన పథకం సత్ఫలితాలనిచ్చిందని ఎస్పీ కార్తీక్‌.ఎస్‌ తెలిపారు. లొంగుబాట పట్టిన పది మందిలో ఏరియా కమాండర్లు బిశాల్‌ ఖేర్వార్‌, కైలాష్‌ ఖేర్వార్‌ ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement