డ్రైవర్‌కు గుండెపోటు: బస్సు బోల్తా | 10 injured in rtc bus roll at jaggaiah pet | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌కు గుండెపోటు: బస్సు బోల్తా

Nov 29 2016 10:43 AM | Updated on Apr 7 2019 3:24 PM

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

జగ్గయ్యపేట: కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 21 మంది ప్రయాణికులతో సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి విజయవాడకు బస్సు బయలుదేరగా చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్దకు చేరుకునేసరికి డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ సహా గాయపడిన వారందరినీ జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement