ప్రాక్టీస్ కు యువీ దూరం | Yuvraj Singh Skips Training Ahead of Warm up Match | Sakshi
Sakshi News home page

ప్రాక్టీస్ కు యువీ దూరం

May 27 2017 3:54 PM | Updated on Sep 5 2017 12:09 PM

ప్రాక్టీస్ కు యువీ దూరం

ప్రాక్టీస్ కు యువీ దూరం

చాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఇంగ్లండ్ కు పయనమైన భారత క్రికెట్ జట్టు.. ముమ్ముర ప్రాక్టీస్ తో తీవ్రంగా శ్రమిస్తోంది.

లండన్: చాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఇంగ్లండ్ కు పయనమైన భారత క్రికెట్ జట్టు.. ముమ్ముర ప్రాక్టీస్ తో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మేరకు శనివారం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఎంఎస్ ధోని, అజింక్యా రహానే, కెప్టెన్ విరాట్ కోహ్లిలు ప్రాక్టీస్ కు పదునుపెట్టారు. దాంతో పాటు పలువురు బౌలర్లు సైతం ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడిపారు.

అయితే మరో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం ప్రాక్టీస్ కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం యువీ జ్వరంతో బాధపడతున్నందున ప్రాక్టీస్ కు దూరంగా ఉన్నాడు. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగే  ప్రాక్టీస్ మ్యాచ్ కు యువీ అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా, యువరాజ్ సాధ్యమైనంత తొందరగా కోలుకుంటాడని టీమిండియా యాజమాన్యం ఆశిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement