బెంగళూరు ఓపెన్‌ క్వార్టర్స్‌లో యూకీ బాంబ్రీ | Yuki Bhambri enters quarter finals | Sakshi
Sakshi News home page

బెంగళూరు ఓపెన్‌ క్వార్టర్స్‌లో యూకీ బాంబ్రీ

Nov 23 2017 11:28 AM | Updated on Nov 23 2017 11:28 AM

Yuki Bhambri enters quarter finals - Sakshi

స్వదేశంలో వరుసగా రెండో ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌ నెగ్గాలనే లక్ష్యంతో ఉన్న భారత టెన్నిస్‌ యువతార యూకీ బాంబ్రీ బెంగళూరు ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో యూకీ 6–2, 7–6 (7/0)తో పెడ్రో మార్టినెజ్‌ (స్పెయిన్‌)పై గెలిచాడు.

ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో సుమీత్‌ నాగల్‌ (భారత్‌) 6–4, 4–6, 7–5తో బ్రైడన్‌ క్లియెన్‌ (బ్రిటన్‌)పై, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ (భారత్‌) 6–2, 6–7 (1/7), 6–1తో మార్క్‌ పాల్‌మన్స్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు.అయితే రామ్‌కుమార్‌ రామనాథన్‌ 7–6 (7/3), 2–6, 4–6తో జే క్లార్క్‌ (బ్రిటన్‌) చేతిలో ఓడిపోయాడు.   
 

Advertisement
 
Advertisement
Advertisement