భారత మహిళల జట్టుకు తొలి ఓటమి | World Team Chess: Tania Sachdev guides India to win over USA | Sakshi
Sakshi News home page

భారత మహిళల జట్టుకు తొలి ఓటమి

Jun 20 2017 12:46 AM | Updated on Sep 5 2017 1:59 PM

భారత మహిళల జట్టుకు తొలి ఓటమి

భారత మహిళల జట్టుకు తొలి ఓటమి

ప్రపంచ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు తొలి ఓటమిని చవిచూసింది. ఉక్రెయిన్‌తో సోమవారం జరిగిన మూడో రౌండ్‌లో భారత్‌ 1.5–2.5తో ఓడిపోయింది.

ఖాంటీ మన్‌సిస్క్‌ (రష్యా): ప్రపంచ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు తొలి ఓటమిని చవిచూసింది. ఉక్రెయిన్‌తో సోమవారం జరిగిన మూడో రౌండ్‌లో భారత్‌ 1.5–2.5తో ఓడిపోయింది. అనా ఉషెనినాతో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 62 ఎత్తుల్లో; లులిజా ఉస్మాక్‌తో జరిగిన గేమ్‌ను ఇషా కరవాడే 50 ఎత్తుల్లో; నటాలియా బుక్సాతో జరిగిన గేమ్‌ను పద్మిని రౌత్‌ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఇనా గపోనెంకో చేతిలో తానియా సచ్‌దేవ్‌ 83 ఎత్తుల్లో ఓడిపోయింది. మరోవైపు భారత పురుషుల జట్టు 2.5–1.5తో బెలారస్‌పై గెలిచి ఈ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. విదిత్, పరిమార్జన్‌ నేగి, శశికిరణ్‌ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... ఆదిబన్‌ నెగ్గి భారత్‌ను గెలిపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement