చైనాను నిలువరించిన భారత్‌ | World Team Chess Championship 2017: Indian men draw | Sakshi
Sakshi News home page

చైనాను నిలువరించిన భారత్‌

Jun 25 2017 1:04 AM | Updated on Sep 5 2017 2:22 PM

ప్రపంచ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఏడో రౌండ్‌లో భారత మహిళల జట్టు 2–2తో పటిష్టమైన చైనా జట్టును నిలువరించింది.

ఖాంటీ మన్‌సిస్క్‌ (రష్యా): ప్రపంచ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఏడో రౌండ్‌లో భారత మహిళల జట్టు 2–2తో పటిష్టమైన చైనా జట్టును నిలువరించింది. జూ వెన్‌జున్‌తో జరిగిన గేమ్‌ను హారిక, ప్రపంచ చాంపియన్‌ తాన్‌ జోంగితో జరిగిన గేమ్‌ను తానియా ‘డ్రా’ చేసుకోగా... కి గువోపై పద్మిని రౌత్‌ గెలిచింది. లీ తింగ్‌జీ చేతిలో ఇషా కరవాడే ఓడిపోయింది. పురుషుల విభాగంలో భారత జట్టు 2.5–1.5తో ఉక్రెయిన్‌పై గెలిచింది. ఆదిబన్‌ నెగ్గగా... శశికిరణ్, విదిత్, పరిమార్జన్‌ నేగి తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు.

Advertisement
 
Advertisement
Advertisement