ప్రిక్వార్టర్స్‌లో రుత్విక ఓటమి | world junnor badmiton championship Ruthvika lost the game in pre-quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో రుత్విక ఓటమి

Nov 1 2013 12:17 AM | Updated on Jul 12 2019 6:04 PM

ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ కథ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రుత్విక శివాని ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది.

బ్యాంకాక్ (థాయ్‌లాండ్): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ కథ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రుత్విక శివాని ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 10-21, 15-21తో జపాన్‌కు చెందిన అకెన్ యమగుచి చేతిలో పరాజయం చవిచూసింది. అంతకుముందు మూడో రౌండ్ పోరులో ఆమె 21-16, 18-21, 21-13తో మరియా మిత్సోవా (బల్గేరియా)పై విజయం సాధించింది. తొలి గేమ్‌లో కాస్త పోటీనిచ్చిన ప్రత్యర్థి రెండో గేమ్‌లో విజృంభించి గేమ్‌ను చేజిక్కించుకుంది. తిరిగి నిర్ణాయక మూడో గేమ్‌లో ఏపీ అమ్మాయి పుంజుకొని మిత్సోవాను కంగుతినిపించింది.
 
 రుత్విక నెట్ వద్ద 4 పాయింట్లు, స్మాష్‌లతో 8 పాయింట్లు సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ మూడో రౌండ్ పోటీల్లో మేఘన-సాన్యామ్ శుక్లా జంట 13-21, 10-21తో హే రిన్ కిమ్-జంగ్ హో కిమ్ (దక్షిణకొరియా) జోడి చేతిలో, సంతోష్ రావూరి-పూర్వీషా రామ్ జోడి 11-21, 13-21తో ఫేబియాన్ రోత్-జెన్నిఫర్ కార్నోట్ (జర్మనీ) జంట చేతిలో పరాజయం చవిచూశాయి. మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ దాస్, పురుషుల సింగిల్స్‌లో ఆదిత్య జోషి, అరుణ్ జార్జ్‌లు కూడా ఇంటిదారి పట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement