భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటమే తన లక్ష్యమని, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో పదవులు అందుకోవాలనే
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటమే తన లక్ష్యమని, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో పదవులు అందుకోవాలనే ఆశ తనకు లేదని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ఠాకూర్‌కు ముందు బోర్డు అధ్యక్షుడిగా ఉండి, ఇప్పుడు ఐసీసీ చైర్మన్ అయిన శశాంక్ మనోహర్‌ను ఆయన పరోక్షంగా విమర్శించారు. ‘ఐసీసీకి వెళ్లాలని భావించిన వ్యక్తి ఎప్పుడో వెళ్లిపోయారు. నాకు దానిపై ఎలాంటి ఆసక్తీ లేదు. భారత్‌కంటే నాకూ ఏదీ ముఖ్యం కాదు. ప్రస్తుతం బీసీసీఐలో నా పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నా. ఎక్కడ ఉన్నా భారత హక్కులు పరిరక్షించడమే ముఖ్యం’ అని ఠాకూర్ స్పష్టం చేశారు. భారత్‌కు ప్రస్తుతం డబ్బు అవసరం లేదని, కానీ ఇతర దేశాలకు ఇవ్వాలంటే ఐసీసీ తమ ఖర్చులను కూడా తగ్గించుకోవాలని ఆయన సూచించారు.