పాక్‌ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు!

West Indies's Sammy Applied For Pakistan Nationality - Sakshi

కరాచీ: వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డారెన్ డారెన్ సామీ త్వరలో పాకిస్తాన్‌ పౌరునిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా పాకిస్తాన్‌ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు చేసుకున్నాడట. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పాకిస్తాన్ పౌరసత్వాన్ని పొందుతాడు. 2004లో విండీస్‌ తరఫున అరంగ్రేటం చేసిన సామీ ఆ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 2016లో డారెన్‌ సామీ కెప్టెన్సీలో విండీస్‌ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. విండీస్‌ తరఫున 38 టెస్టుల్లో, 126 వన్డేల్లో, 68 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించిన సామీ.. 2017 సెప్టెంబర్‌లో చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు.

కాగా విండీస్‌ బోర్డుతో విభేదాల నేపథ్యంలో చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో విదేశీ లీగ్‌ల్లో ఆడుతూ సత్తాచాటుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్ సూప‌ర్ లీగ్(పీఎస్ఎల్‌) ప్రారంభమైన్పపటికి నుంచి రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. పీఎస్ఎల్‌లో పెషావర్ జెల్మీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పీఎస్ఎల్‌ మెరుపులు మెరిపిస్తూ అక్కడి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఎంతలా అంటే.. సామి తమ దేశం తరుపున ఆడాలని కోరుకునే ఫ్యాన్స్‌కు కొదవేలేదు.ఇదిలా ఉండగా.. అతనికి గౌర‌వ పౌర‌సత్వం ఇవ్వాల‌ని ఆ దేశ ప్రెసిడెంట్‌కు ద‌ర‌ఖాస్తు అందింది. పీఎస్ఎల్ జ‌ట్టు పెషావ‌ర్ జ‌ల్మీ ఓనర్‌ జావిద్ ఆఫ్రిది తాజాగా సామీ ద‌ర‌ఖాస్తును పరిశీలనకు పంపించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top