చివరి నిమిషంలో పొలార్డ్‌ అవుట్‌..! | West Indies allrounder Kieron Pollard opts out of T20Is in New Zealand for personal reasons | Sakshi
Sakshi News home page

చివరి నిమిషంలో పొలార్డ్‌ అవుట్‌..!

Dec 28 2017 1:09 PM | Updated on Dec 28 2017 1:09 PM

West Indies allrounder Kieron Pollard opts out of T20Is in New Zealand for personal reasons - Sakshi

హమిల్టన్‌: న్యూజిలాండ్‌తో రేపట్నుంచి ఆరంభం కానున్న టీ 20 సిరీస్‌కు వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ కీరోన్‌ పొలార్డ్‌ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో చివరి నిమిషంలో కివీస్‌తో టీ20 సిరీస్‌ నుంచి పొలార్డ్‌ వైదొలిగినట్టు వెస్టిండీస్‌ క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇప్పటికే గాయంతో పేసర్‌ రాన్స్‌ఫోర్డ్‌ బీటన్‌ దూరం కాగా, తాజాగా టీ 20 స్పెషలిస్టు పొలార్డ్‌ సైతం తప్పుకున్నట్లు  విండీస్‌ కోచ్‌ హెస్సెన్‌ తెలిపారు. పొలార్డ్‌ స్థానంలో ఎడమచేతి బ్యాట్స్‌మన్‌ షిమ్రోన్‌ హేట్‌మెయిర్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరొకవైపు బీటన్‌ స్థానంలో లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డాన్‌ కాట్రెల్‌ జట్టుతో కలవనున్నాడు.

ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయిన వెస్టిండీస్‌.. కనీసం టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకుని పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. మరొకవైపు స్వదేశంలో వరుస విజయాలు సాధిస్తున్న కివీస్‌కు వరల్డ్‌ టీ 20 చాంపియన్‌ వెస్టిండీస్‌ ఎంతవరకూ పోటీ ఇస్తుందో చూడాలి. శుక్రవారం నుంచి ఇరు జట్ల  మధ్య మూడు టీ 20ల సిరీస్‌ ఆరంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement