సిరాజ్‌కు సిక్స్‌తో స్వాగతం | welcome to the crease RCB Pacer Siraj with Six | Sakshi
Sakshi News home page

సిరాజ్‌కు సిక్స్‌తో స్వాగతం

Apr 17 2018 8:43 PM | Updated on Apr 17 2018 8:43 PM

welcome to the crease RCB Pacer Siraj with Six - Sakshi

ముంబై: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) పేసర్‌ మొహ్మద్‌ సిరాజ్‌కు సిక్స్‌తో స్వాగతం లభించింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగిన సిరాజ్‌  అందుకున్న తొలి ఓవర్‌ మొదటి బంతికి సిక్స్‌ సమర్పించుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్‌లో భాగంగా  ఐదో ఓవర్‌ను సిరాజ్‌ వేయగా,  స్టైకింగ్‌ ఎండ్‌లో ఉన్న లూయిస్‌ తొలి బంతిని సిక్స్‌ కొట్టాడు.

సిరాజ్‌ ఆ తర్వాత మూడు బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా నియంత్రించినా, ఐదో బంతిని వైడ్‌గా వేశాడు. ఆ బంతికి కాస్తా బౌండరీకి వెళ్లడంతో మొత్తం ఐదు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బంతిని ఫోర్‌ కొట్టిన లూయిస్‌.. చివరి బంతికి సింగిల్‌ తీశాడు. సిరాజ్‌ వేసిన ఒక్క ఓవర్‌లోనే 16 పరుగులు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement