
ముంబై: ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు సభ్యులంతా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు భయపడ్డామని పేస్ బౌలర్ నాగర్‌కోటి తెలిపాడు. సరదాగా కొన్నిసార్లు బయటకు వెళ్లడానికి ద్రవిడ్ సర్ అనుమతించినా.. నిర్ణీత సమయంలోపు హోటల్‌కు కచ‍్చితంగా రావాలనే ఆదేశాలు ఉండేయన్నాడు. దాంతో బయటకు వెళ్లినా భయపడుతూనే వెళ్లేవాళ్లమన్నాడు. కాకపోతే ఆయన విధించిన నిషేధాజ్ఞలను తామెప్పుడూ ఉల్లంఘించలేదని చెప్పాడు. కొన్నిసార్లు సాహసకృత్యాలు చేద్దామనుకున్నా అనుమతించేవారు కాదన్నాడు.
ద్రవిడ్ సర్ అంటే మాకు కాస్త భయం. అందుకే ఎప్పుడూ ఎలాంటి దుందుడుగు నిర్ణయాలు తీసుకోలేదు. కొన్నిసార్లు సాహసకృత్యాలు చేయాలనుకున్నా సర్ మాటకు కట్టుబడి ఉండేవాళ్లం. సర్ మనకోసమే ఆంక్షలు విధించి ఉంటారని అనుకుని జాగ్రత్తగా నడుచుకునే వాళ్లం. నేను తీసుకున్న తొలి అటోగ్రాఫ్ ద్రవిడ్‌దే' అని నాగర్‌కోటి తెలిపాడు.