మళ్లీ పెళ్లాడిన వసీమ్ అక్రమ్ | Wasim Akram marries Australian girlfriend Shaniera Thompson | Sakshi
Sakshi News home page

మళ్లీ పెళ్లాడిన వసీమ్ అక్రమ్

Aug 22 2013 1:37 AM | Updated on Sep 1 2017 9:59 PM

మళ్లీ పెళ్లాడిన వసీమ్ అక్రమ్

మళ్లీ పెళ్లాడిన వసీమ్ అక్రమ్

పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ మరో పెళ్లి చేసుకున్నాడు. వారం క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ప్రియురాలు షనీరా థాంప్సన్‌ను వివాహం చేసుకున్నానని అతను వెల్లడించాడు.

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ మరో పెళ్లి చేసుకున్నాడు. వారం క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ప్రియురాలు షనీరా థాంప్సన్‌ను వివాహం చేసుకున్నానని అతను వెల్లడించాడు.
 
 ‘లాహోర్‌లో నిరాడంబరంగా మా వివాహం జరిగింది. నా పిల్లలతో కలిసి ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించింది. ఉర్దూ భాషను కూడా నేర్చుకుంటోంది. అంతకుమించి మా అబ్బాయిలిద్దరితో బాగా కలిసిపోయింది’ అని 47 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ తెలిపాడు. గత నెలలో 30 ఏళ్ల థాంప్సన్‌తో పెళ్లి ప్రతిపాదన తేగా ఆమె సమ్మతించినట్లు అక్రమ్ చెప్పాడు. అక్రమ్ మొదటి భార్య హుమా అనారోగ్యంతో 2009లో మృతి చెందింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement