వార్నర్ తొలిసారి.. | Warner seals top spot in ODI rankings for first time | Sakshi
Sakshi News home page

వార్నర్ తొలిసారి..

Jan 27 2017 3:35 PM | Updated on Sep 5 2017 2:16 AM

ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్ తో చెలరేగిపోతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.

దుబాయ్:ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్ తో చెలరేగిపోతున్న  ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలను దాటుకుని మరీ వార్నర్ తొలిస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. గత రెండు  రోజుల క్రితం పాకిస్తాన్ తో జరిగిన వన్డేలో 179 పరుగులతో రాణించిన వార్నర్.. తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుని టాప్లో నిలిచాడు. ఈ మేరకు  శుక్రవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో వార్నర్ 880 రేటింగ్  పాయింట్లతో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు.

 

తాజా ర్యాంకింగ్స్ లో డివిలియర్స్ 861 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లి 852 పాయింట్లతో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో వార్నర్ తొలిస్థానాన్ని ఆక్రమించడం ఇదే ప్రథమం. 2016 జనవరి నుంచి ఇప్పటివరకూ 28 వన్డేలు ఆడిన వార్నర్ 1,755 పరుగులు చేసి సత్తా చాటుకున్నాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు ఉండటం మరో విశేషం. మరొకవైపు వన్డే జట్ల ర్యాంకింగ్స్ లో భారత్ మూడో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉంది. ఇక వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ లో్ ఏ ఒక్క భారత్ బౌలర్ కూడా టాప్-10లో స్థానం సంపాదించలేకపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement