ఫైనల్లో విష్ణువర్ధన్‌ జోడి | vishnuvardhan enters final of itf tourney | Sakshi
Sakshi News home page

ఫైనల్లో విష్ణువర్ధన్‌ జోడి

Mar 24 2017 10:40 AM | Updated on Sep 5 2017 6:59 AM

ఫైనల్లో విష్ణువర్ధన్‌ జోడి

ఫైనల్లో విష్ణువర్ధన్‌ జోడి

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఫ్యూచర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ జోడి ఫైనల్లో ప్రవేశించింది.

టెన్నిస్‌ టోర్నమెంట్‌


త్రివేండ్రం: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఫ్యూచర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ జోడి ఫైనల్లో ప్రవేశించింది. త్రివేండ్రం టెన్నిస్‌ క్లబ్‌లో గురువారం జరిగిన డబుల్స్‌ సెమీస్‌లో టాప్‌ సీడ్‌ విష్ణువర్ధన్‌– శ్రీరామ్‌ బాలాజీ ద్వయం 6–2,7–5తో కునాల్‌ ఆనంద్‌– అన్విత్‌ బిండ్రే జంటపై గెలుపొందింది. శుక్రవారం జరిగే ఫైనల్లో విష్ణువర్ధన్‌ జోడి జుయ్‌–చెన్‌ హంగ్‌ (చైనీస్‌ తైపీ)– హాంగ్‌ కిట్‌ వాంగ్‌ జంటతో తలపడుతుంది. సింగిల్స్‌ విభాగంలోనూ విష్ణువర్ధన్‌ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.

 

క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో విష్ణు 6–3, 7–6 (3)తో హాడిన్‌ బావాపై గెలుపొందగా... టాప్‌ సీడ్‌ ప్రజ్నేశ్‌ గున్నేశ్వరన్‌ 6–2, 6–2తో విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో శ్రీరామ్‌ బాలాజీ 6–4, 6–2తో రాజ్‌నీత్‌ విరాళి మురుగేశన్‌పై, దల్వీందర్‌ సింగ్‌ 6–3, 6–3తో జయేశ్‌పై గెలిచారు. సెమీస్‌లో విష్ణు, శ్రీరామ్‌ బాలాజీతో తలపడతాడు.   

 

Advertisement
 
Advertisement
Advertisement