విశాఖలో క్రికెట్ సందడి | Vishakapatnam cricket celebrations | Sakshi
Sakshi News home page

విశాఖలో క్రికెట్ సందడి

Aug 28 2013 2:08 AM | Updated on Sep 1 2017 10:10 PM

యువ క్రికెటర్ల టోర్నీలకు తరచుగా ఆతిథ్యం ఇస్తున్న విశాఖపట్నంలో మరోసారి కుర్రాళ్లు సందడి చేయనున్నారు. భారత్ ‘ఎ’- న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య సిరీస్ నేడు ప్రారంభం కానుంది.

 విశాఖపట్నం, న్యూస్‌లైన్: యువ క్రికెటర్ల టోర్నీలకు తరచుగా ఆతిథ్యం ఇస్తున్న విశాఖపట్నంలో మరోసారి కుర్రాళ్లు సందడి చేయనున్నారు. భారత్ ‘ఎ’- న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య సిరీస్ నేడు ప్రారంభం కానుంది.  ఈ సిరీస్‌లో రెండు జట్ల మధ్య ఒక మూడు రోజుల మ్యాచ్, ఒక నాలుగు రోజుల మ్యాచ్, మూడు వన్డేలు నిర్వహిస్తారు. మూడు రోజుల మ్యాచ్ బుధవారం నుంచి పోర్ట్ స్టేడియంలో జరుగుతుంది.
 
 మిగిలిన మ్యాచ్‌లన్నీ వైఎస్‌ఆర్ వీడీసీఏ స్టేడియంలో జరుగుతాయి. భారత్ యువ జట్టుకు అభిషేక్ నాయర్, న్యూజిలాండ్ జట్టుకు లాథమ్ సారథ్యం వహిస్తున్నారు. భారత్ ఆడే వన్డే సిరీస్‌కు మాత్రం ఉన్ముక్త్ చంద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మంగళవారం ఇరు జట్లు వైఎస్‌ఆర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement