కివీస్‌ చేరిన కోహ్లి బృందం | Virat Kohli Posts Photo From Auckland As Team India Reaches New Zealand | Sakshi
Sakshi News home page

కివీస్‌ చేరిన కోహ్లి బృందం

Jan 22 2020 3:23 AM | Updated on Jan 22 2020 3:23 AM

Virat Kohli Posts Photo From Auckland As Team India Reaches New Zealand  - Sakshi

ఆక్లాండ్‌: మూడు ఫార్మాట్‌లలోనూ న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత క్రికెట్‌ జట్టు కివీస్‌ గడ్డపై అడుగు పెట్టింది. ఆక్లాండ్‌ చేరుకున్నామంటూ కెప్టెన్‌ కోహ్లి సహచర ఆటగాళ్లు అయ్యర్, శార్దుల్‌లతో కలిసి ట్వీట్‌ చేశాడు. ఈ పర్యటనలో భారత్, కివీస్‌ మధ్య 5 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. ఈ నెల 24న తొలి టి20 మ్యాచ్‌తో పోరు మొదలవుతుంది. గత ఏడాది న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత్‌ వన్డే సిరీస్‌ను 4–1తో గెలుచుకొని టి20 సిరీస్‌ను 1–2తో కోల్పోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement